సోమవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు కలిసి వచ్చాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 569 పాయింట్లు లాభపడి 30 వేల 598 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్లు వృద్ధి చెంది 8 వేల 988 వద్ద ట్రేడవుతోంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ త్వరలోనే రాబోతుందనే ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను పెంచిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా అనే బయోటెక్నాలజీ సంస్థ తాము కనుగొన్న వ్యాక్సిన్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రకటించడమే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
లాభనష్టాల్లో...
ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, మారుతి సుజుకి, ఆటో బజాజ్, కోటక్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్ రాణిస్తున్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, విప్రో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వాల్‌స్ట్రీట్ కూడా లాభాలతోనే ముగిసింది.