ఈక్విటీ బెంచ్ మార్క్ సెన్సెక్స్ ప్రారంభ సెషన్లో 500 పాయింట్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ సానుకూలతల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ లాభాలతో దూసుకుపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 420 పాయింట్లు వృద్ధి చెంది 32 వేల 63 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు లాభఫడి 9 వేల 374 వద్ద ట్రేడవుతోంది.
ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దీపనలపై మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
లాభనష్టాల్లో
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతానికి పైగా 3 లాభాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐటీసీ రాణిస్తున్నాయి.
నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, బీపీసీఎల్ నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు
అంతర్జాతీ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.16 శాతం పడిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 30.61 డాలర్లుగా ఉంది.
రూపాయి విలువ
ఇవాళ ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 5 పైసలు తగ్గి.. ఒక డాలరుకు రూ.75.59కు చేరుకుంది.