దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ తన ద్రవ్యవిధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు (5.15 రెపో రేటు) యథాతథంగా ఉంచనుందని వార్తలు వస్తున్నా... మదుపరులు దూకుడు మీద ఉండడం గమనార్హం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు వృద్ధి చెంది 41 వేల 240 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12 వేల 121 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, మారుతి, టైటాన్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకు, టీసీఎస్, ఓఎన్జీసీ రాణిస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంకు, టాటాస్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు