తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్ అండతో రెండో రోజూ బుల్​ జోరు.. సెన్సెక్స్​ 696 ప్లస్​ - bse sensex

Stock markets: బడ్జెట్​ సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా జోరు ప్రదర్శించాయి. సెన్సెక్స్​ 696 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు వృద్ధి చెందాయి. ఇండస్ఇండ్, బజాజ్​ ఫిన్​సర్వ్ షేర్లు 5శాతానికిపైగా లాభపడ్డాయి.

stock market news
స్టాక్ మార్కెట్​ న్యూస్​

By

Published : Feb 2, 2022, 3:49 PM IST

Stock market news: స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, కేంద్ర బడ్జెట్​లో కొత్త పన్నులు లేకపోవడం మదుపర్లను కొనగోళ్ల వైపు మొగ్గుచూపేలా చేశాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ, బడ్జెట్​లో మౌలిక వసతుల వ్యయం భారీగా పెంచడం వంటి అంశాలు మార్కెట్​ సెంటిమెంట్​ను బలోపేతం చేశాయి. దీంతో సెన్సెక్స్ 696 పాయింట్లు వృద్ధి చెంది 59,558కి చేరింది. నిఫ్టీ 203 పాయింట్లు మెరుగుపడి 17,780కి పెరిగింది.

ఇంట్రాడే..

బుధవారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్​ లాభాల బాటలోనే నడిచింది. ఓపెనింగ్ సెషన్​లో 59,293 నుంచి 100 పాయింట్లు కోల్పోయి.. అనంతరం మళ్లీ కోలుకుని 59 వేల 500 పాయింట్లకుపైగా దూసుకెళ్లింది. చివరకు 59,558 వద్ద స్థిరపడింది. బుధవారం సెషన్​లో సెన్సెక్స్​ 59,193 అత్యల్ప స్థాయిని, 59,583 అత్యధిక స్థాయిని తాకింది. నిఫ్టీ 17,788 పాయింట్ల గరిష్ఠాన్ని, 17,674 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లోనివి..

అత్యధికంగా ఇండస్ ఇండ్​, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు 5శాతానికి పైగా లాభపడ్డాయి. కోటక్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, డా.రెడ్డీస్ షేర్లు 2శాతానికిపైగా వృద్ధి చెందాయి.

టెక్​ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్​, మారుతి, నెస్లీ షేర్లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:డియర్​ ప్యాసింజర్స్.. వెల్​కమ్.! రతన్ టాటా స్పెషల్ మెసేజ్

ABOUT THE AUTHOR

...view details