Stock market news: స్టాక్ మార్కెట్లు ఈ వారం తొలిరోజును భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 814 పాయింట్లు వృద్ధి చెంది 58,014కి చేరింది. నిఫ్టీ 238 పాయింట్లు మెరుగుపడి 17,339 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలకు తోడు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి 9.2శాతంగా ఉంటుందనే అంచనాలు, ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని తెలపడం వంటి అంశాలు మదుపర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు గడించాయి.
ఇంట్రాడే..
ఉదయం 58వేల 103 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తొలుత నష్టాలను చూసింది. ఆ తర్వాత వెంటనే లాభాల బాట పట్టి 600 పాయింట్లు వృద్ధి చెందింది. మిడ్ సెషన్ తర్వాత మరింత జోరు ప్రదర్శించింది. ఒకానొక దశలో దాదాపు 1000 పాయింట్లకుపైగా పెరిగింది. తర్వాత కాస్త తగ్గింది. మొత్తంగా సెషన్ ముగిసే సరికి సెన్సెక్స్ 814 పాయింట్లు మెరుగుపడింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో 238 పాయింట్లు పెరిగింది.
లాభనష్టాలోనివి ఇవే..