Stock market news: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ముడి చమురు ధరలు పెరగడం, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాల మదుపర్లను ప్రభావితం చేశాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,099కి పడిపోయింది. నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.
చమురు మంటకు తోడు కొవిడ్ దెబ్బ- సెన్సెక్స్ 656 డౌన్
Stock market news: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 656 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 175 పాయింట్లు పతనమైంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
ఓఎన్జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హిండాల్కో షేర్లు లాభాలను ఆర్జించాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో షేర్లు నష్టాలను చవిచూశాయి.