తెలంగాణ

telangana

ETV Bharat / business

రోజంతా ఒడుదొడుకులు.. చివరకు స్వల్ప లాభాలు - నిఫ్టీ న్యూస్​

Stock Market: స్టాక్​మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధర బ్యారెల్​కు 86 డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వల్ల రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలు ఆర్జించాయి.

stock market
స్టాక్​ మార్కెట్​

By

Published : Jan 17, 2022, 3:35 PM IST

Stock Market: సోమవారం ఆద్యంతం ఊగిసలాటతో సాగిన స్టాక్​ మార్కెట్​ సూచీలు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మదపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. బ్యారెల్ ముడి చమురు ధర 86డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వంటి కారణాల వల్ల మార్కెట్లు మధ్యాహ్నం సెషన్​ వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 61,308వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి చెంది 18,308 వద్ద స్థిరపడింది.

హీరో మోటోకార్ప్​, అల్ట్రాటెక్ సిమెంట్​, గ్రాసిమ్​, ఒఎన్​జీసీ షేర్లు ప్రధానంగా లాభాలు ఆర్జించాయి.

హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బ్రిటానియా, యాక్సిస్​ బ్యాంక్​, సిప్లా షేర్లు లాభాలు చవిచూశాయి.

ఇదీ చదవండి:మరో టీకాపై డీసీజీఐ నజర్- ట్రయల్స్ డేటా పరిశీలన!

ABOUT THE AUTHOR

...view details