తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా- సెన్సెక్స్​ 1,024 మైనస్​​ - సెన్సెక్స్ న్యూస్​

Stock market news: అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, వడ్డీరేట్ల పెంపుపై అనుమానాల నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 1000కిపైగా పాయింట్లు నష్ట పోయింది. నిఫ్టీ 300 పాయింట్లకుపైగా క్షీణించింది.

stock market news
స్టాక్ మార్కెట్ న్యూస్​

By

Published : Feb 7, 2022, 3:38 PM IST

Stock markets: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఆర్​బీఐ ద్రవ్యపరమతి సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోననే అనిశ్చితి మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 1024 పాయింట్లు కోల్పోయి 57,621కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు క్షీణించి పాయింట్ల 17,213 వద్ద స్థిరపడింది.

కారణాలు..

ముడిచమురు ధరలు భారీగా పెరగుతుండటం వల్ల ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటుండటం, అమెరికా ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లో ఉండటం మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే ఫిబ్రవరి 8-10 మధ్య సమావేశం కానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాలపై అనిశ్చితి నెలకొంది. వడ్డీ రేట్ల పెంపు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని కొందరు.. స్వల్ప పెంపు ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

ఇంట్రాడే..

సోమవారం ఓపెనింగ్​ సెషన్​ను 58,549 పాయింట్ల వద్ద ప్రారంభించిన సెన్సెక్స్​ 58,707 పాయింట్ల గరిష్ఠాన్ని, 57,299 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఏ దశలోనూ కోలుకునే పరిస్థితిలో కన్పించలేదు. నిఫ్టీ కూడా ఇదే ట్రెండ్ కొనసాగించింది. ఓపెనింగ్ సెషన్​ను 17,456 పాయింట్లతో ప్రారంభించి.. 17,536 పాయింట్ల కనిష్ఠాన్ని, 17,119 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

లాభనష్టాల్లోనివి..

పవర్​గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్​, ఎస్​బీఐఎన్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ మాత్రమే లాభాలను ఆర్జించాయి. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చదవండి:వడ్డీ రేట్ల పెంపు ఖాయమా? నిపుణుల మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details