Stock Market Closing
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్లో సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయాయి.
17:12 February 04
Stock Market Closing
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్లో సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయాయి.
12:23 February 04
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లిన సూచీలు మళ్లీ పడిపోయాయి. దీంతో సెన్సెక్స్ 309 పాయింట్లు కోల్పోయి 58,478కి చేరింది. నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 17,492 వద్ద ఉంది.
హిండాల్కో, దివిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
09:09 February 04
స్టాక్ మార్కెట్లు
Stock markets: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 235 పాయింట్లు క్షీణించి 58,552కి చేరింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి వద్ద 17,499 ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాల కారణంగా మదపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
లాభనష్టాల్లోనివి
ఓఎన్జీసీ, ఐటీసీ, టైటాన్, బ్రిటాయనియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.