కాస్త కుదుటపడ్డ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్ సూచీలు ఇంట్రాడే సెషన్లో కాస్త కుదుటపడ్డాయి. ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి సూచీలు. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 950 పాయింట్లకుపైగా నష్టపోయింది.
ప్రస్తుతం 500 పాయింట్ల నష్టంతో 59 వేల 720 ఎగువన కొనసాగుతోంది.
నిఫ్టీ 146 పాయింట్లు క్షీణించి 17 వేల 770 ఎగువన ఉంది.
లాభనష్టాల్లో..
యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్, మారుతీ సుజుకీ లాభాల్లో ఉన్నాయి.