పుంజుకున్న మార్కెట్లు..
భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కాస్త తేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో.. 54 వేల 800 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 380 వద్ద ఉంది.
13:03 March 04
పుంజుకున్న మార్కెట్లు..
భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కాస్త తేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో.. 54 వేల 800 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 380 వద్ద ఉంది.
10:30 March 04
1000 పాయింట్లు పతనం..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 1077 పాయింట్ల నష్టంతో.. 54 వేల 25 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 322 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 175 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ఐటీసీ, టాటా స్టీల్ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1-2 శాతం మేర పడిపోయాయి.
లాభనష్టాల్లో..
యూపీఎల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్ రాణిస్తున్నాయి.
ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, హెచ్‌యూఎల్ డీలాపడ్డాయి.
08:56 March 04
న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా అటాక్.. కుప్పకూలిన మార్కెట్లు
stock market live: ఉక్రెయిన్- రష్యా యుద్ధప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలోనే భారీ నష్టంతో ప్రారంభమైంది.
సెన్సెక్స్ 730 పాయింట్ల నష్టంతో.. 54 వేల 390 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16 వేల 280 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో ఇవే..
హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎన్టీపీసీ రాణిస్తున్నాయి.
ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో డీలాపడ్డాయి.