తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Markets Live: బుల్ జోరు- ఆల్​టైం హైకి సూచీలు - స్టాక్ మార్కెట్ న్యూస్

stock market live updates
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్​

By

Published : Aug 30, 2021, 9:35 AM IST

Updated : Aug 30, 2021, 10:57 AM IST

10:47 August 30

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. మార్కెట్ల చరిత్రలోనే సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ 591 పాయింట్లు బలపడి జీవిత కాల గరిష్టం 56,716కి చేరింది. నిఫ్టీ కూడా 159 పాయింట్లు వృద్ధి చెంది ఆల్​టైం హై 16,864ను తాకింది. 

భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్, హిండాల్కో షేర్ల విలువ పెరిగింది.

టెక్ మహీంద్రా, నెస్లే, విప్రో, హెచ్​సీఎల్ టెక్ షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి.

09:23 August 30

స్టాక్ మార్కెట్ లైవ్​

స్టాక్​ మార్కెట్లు(stock market live updates) ఈ వారం తొలి సెషన్​ను భారీ లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతలతో జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెనెక్స్​ 355 పాయింట్లు మెరుగుపడి 56,480కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 109 పాయింట్లు వృద్ధి చెంది 16,815 వద్ద ట్రేడవుతోంది.

భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Aug 30, 2021, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details