తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

stock market Indices trade higher
భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Aug 31, 2020, 9:38 AM IST

Updated : Aug 31, 2020, 1:55 PM IST

13:47 August 31

భారీ నష్టాలు...

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బీఎస్​ఈ సెన్సెక్స్​ 666 పాయింట్ల నష్టంతో 38,800 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 210 పాయింట్ల దిగువన 11,437 వద్ద ట్రేడ్​ అవుతోంది.

బీఎస్​ఈ-30లో ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, టీసీఎస్​ మినహా అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:36 August 31

భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - సెన్సెక్స్​ 356 పాయింట్ల లాభంతో 39,823 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో 11,749 వద్ద కొనసాగుతోంది. డాలర్​తో పోల్చితే రూపాయి మారకం విలువ 73.38గా ఉంది.

Last Updated : Aug 31, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details