తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండో రోజూ బుల్​ జోరు- సరికొత్త శిఖరాలకు సూచీలు - nse live updates

స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో రోజు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్​ 259 పాయింట్ల లాభంతో 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు వృద్ధి చెంది 13,932 వద్ద స్థిరపడింది. అంతార్జాతీయంగా సానుకూల పరిణామాలు, దేశంలో కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే ఆశలు మదుపర్ల సెంటిమెంట్​కు బలం చేకూర్చాయి.

stock market indices set new record on tuesday
సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్​ సూచీలు

By

Published : Dec 29, 2020, 3:39 PM IST

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, భారత్​లో త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతో స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్​ 259 పాయింట్ల లాభంతో 47,613 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ-నిఫ్టీ 59 పాయింట్లు మెరుగుపడి 13,932 వద్ద స్థిరపడింది.

ఇండస్​ఇండ్ బ్యాంక్​ షేర్లు అత్యధికంగా 5 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. యాక్సిస్ బ్యాంక్​, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ముగిశాయి.

నెస్లీ, టాటా మోటార్స్​, కోల్​ ఇండియా, ఎన్టీపీసీ, హిండాల్కో షేర్లు నష్టాలు చవిచూశాయి.

2.3 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడం, భారత్​లో ఈ వారమే టీకా పంపిణీ మొదలుకానుందనే వార్తలు మదుపర్ల సెంటిమెంటుకు బలం చేకూర్చాయి.

ABOUT THE AUTHOR

...view details