నిఫ్టీ@11,550
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 39,074 వద్దకు చేరింది. సెన్సెక్స్ 39 వేల స్థాయికి చేరడం లాక్డౌన్ తర్వాత ఇదే ప్రథమం. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11,550 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
- భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, ఎల్&టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.