జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయని ఆర్బీఐ చేసిన ప్రకటనతో... దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ... మదుపరులను ఏ మాత్రం సంతృప్తిపరచలేకపోయింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 260 పాయింట్లు కోల్పోయి 30 వేల 672 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 9 వేల 39 వద్ద స్థిరపడింది.
కీలక వడ్డీ రేట్ల తగ్గింపు...
కరోనా సంక్షోభం, లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 4 శాతానికి, రివర్స్ రెపో రేటును 3.75 శాతానికి పరిమితం చేసింది. టర్మ్ లోన్లపై మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
లాభనష్టాల్లో