తెలంగాణ

telangana

ETV Bharat / business

జోష్​ నింపని ప్యాకేజ్​- మార్కెట్లకు స్వల్ప నష్టాలు - నిఫ్టీ

కరోనా ప్యాకేజీ ... డిమాండ్​ను పెంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తుందనే భరోసాను ఇవ్వలేకపోయింది. దీనితో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

stock market closes red
నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు

By

Published : May 15, 2020, 3:43 PM IST

ప్రారంభం నుంచి ఒడుదొడుకులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్​మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీ మార్కెట్లను పెద్దగా ఆకట్టుకోకపోవడం, మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 31 వేల 97 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 9 వేల 136 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో...

భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ, నెస్లే ఇండియా రాణించాయి.

ఎమ్​ అండ్ ఎమ్​, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్, సన్​ఫార్మా నష్టాలు చవిచూశాయి.

ఇదీ చూడండి:కరోనా ప్యాకేజీలో కౌలు రైతుల ఊసేది?

ABOUT THE AUTHOR

...view details