కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం తప్పదన్న అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలు మిగిల్చాయి. దీనికి తోడు కార్పొరేటు ఫలితాలు, దిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా వాహన, లోహ రంగాలు డీలా పడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 132 పాయింట్లు కోల్పోయి 41 వేల 9 పాయింట్లు వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 12 వేల 40 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, కోటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్ రాణించాయి.
జీ ఎంటర్టైన్మెంట్, ఎమ్ అండ్ ఎమ్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, టాట మోటార్స్, సన్‌ఫార్మా షేర్లు పతనమయ్యాయి.
ఆసియా మార్కెట్లు