అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చమురు ధరలు పుంజుకోవడం, కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న ఆశలు కూడాదీనికి దోహదం చేశాయి. అయితే ప్రారంభంలో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు... చివరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 30 వేల 196 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధిచెంది 8 వేల 879 వద్ద స్థిరపడింది.
కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్న వేళ... వ్యాక్సిన్ వస్తుందన్న ప్రకటనలు మదుపరుల్లో కొత్త ఆశలను రేకిత్తిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.