అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడం దీనికి కలిసొచ్చింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32 వేల 200 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 171 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 485 వద్ద స్థిరపడింది.
ఫ్యూచర్స్, డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా ఇవాళ దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే కరోనా కేసులు పెరగడం, ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండడం వల్ల మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
లాభనష్టాల్లో
ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్ రాణించాయి.
ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, విప్రో, సిప్లా, బీపీసీఎల్ నష్టపోయాయి.