Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్కెట్లకు వరుస నష్టాలు తప్పలేదు. అంతర్జాతీయంగా అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 768 పాయింట్లు నష్టపోయింది. 54వేల 333 వద్దకు చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 252 పాయింట్లు పడిపోయి.. 16 వేల 245 వద్ద ఉంది.
ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా అటాక్ అనే వార్తలతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం 450 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. 55వేల 103 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో 54 వేల 333 వద్ద ముగిసింది.