Stock Market Close: ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగా పడింది. దేశీయ సూచీలు గురువారం మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది. గురువారం ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 366 పాయింట్ల నష్టంతో.. 55 వేల 102కు చేరింది.
నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 498 వద్ద ఉంది.
ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకుపైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.