తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 3:40 PM IST

ETV Bharat / business

ఐదో సెషన్​లోనూ 'యుద్ధం' దెబ్బ- సెన్సెక్స్​ 383 పాయింట్లు డౌన్

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా ఐదో సెషన్​లో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 383, నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయాయి. రష్యా- ఉక్రెయిన్​ ఉద్రిక్త పరిస్థితులు.. మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

Stock Market Close
Stock Market Close

Stock Market Close: ఉక్రెయిన్​- రష్యా యుద్ధభయాలతో స్టాక్​ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దేశీయ సూచీలను వరుస నష్టాలు వెంటాడుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 383 పాయింట్లు కోల్పోయి 57 వేల 301 వద్ద స్థిరపడింది.

భారీ నష్టాలతో..

సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడింగ్​ను ప్రారంభించింది. అనంతరం మరింత నష్టాల్లోకి వెళ్లి.. 56 వేల 395 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం అనంతరం.. కాస్త కోలుకొని నష్టం 200 పాయింట్లకు దిగివచ్చింది. ఆఖర్లో మళ్లీ అమ్మకాలతో ఒడుదొడుకులకు లోనైంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 92 వద్ద సెషన్​ను ముగించింది.

దాదాపు అన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. రియాల్టీ ఇండెక్స్​ 2 శాతానికిపైగా పడిపోయింది. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ కూడా భారీగా తగ్గాయి.

Russia Ukraine Crisis:ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలు డొనెట్స్క్‌, లుహాన్స్క్​కు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ రష్యా నిర్ణయం తీసుకోవడం మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఆయా ప్రాంతాలకు రష్యా బలగాలను కూడా పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు.. రష్యాపై ఆంక్షలకు సిద్ధమయ్యాయి.

రష్యా సహా ఐరోపా మార్కెట్లు దాదాపు అన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి.

లాభనష్టాల్లో ఇవే..

ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐషర్​ మోటార్స్​, ఓఎన్​జీసీ, హిందాల్కో స్వల్పంగా లాభపడ్డాయి.

బీపీసీఎల్​, టీసీఎస్​, టాటా స్టీల్​, టాటా మోటార్స్​, ఎస్​బీఐ నష్టపోయాయి.

ఇవీ చూడండి:ఉక్రెయిన్​లోకి రష్యా సైన్యం ఎంట్రీ! ఇక కష్టమే!!

వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇక బంద్! మార్చి నుంచి ఆఫీసులకు!!

Local circles survey: మన సమాచారం ఎవరికో చేరుతోంది..

ABOUT THE AUTHOR

...view details