తెలంగాణ

telangana

ETV Bharat / business

కీలక రంగాల రాణింపుతో.. లాభాల్లో స్టాక్​ మార్కెట్లు - రూపాయి విలువ

విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి తోడు ,కీలక రంగాల షేర్లు రాణిస్తుండడం వల్ల ఇవాళ దేశీయ స్టాక్​మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 41 వేల 686 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 12 వేల మార్కు ఎగువన ట్రేడవుతోంది.

stock market: All the sectoral indices are trading in the green
కీలక రంగాల రాణింపుతో.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Feb 14, 2020, 9:37 AM IST

Updated : Mar 1, 2020, 7:24 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ నిధుల ప్రవాహానికి తోడు, అన్ని కీలక రంగాల షేర్లు రాణించడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 226 పాయింట్లు వృద్ధిచెంది 41 వేల 686 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 12 వేల 237 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఏసియన్​ పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, హెచ్​సీఎల్​ టెక్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, ఎల్​ అండ్​టీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, ఎస్​ బ్యాంకు, బీపీసీఎల్​, జీఎంటర్​టైన్​మెంట్​, టైటాన్​ కంపెనీ, నెస్లే రాణిస్తున్నాయి.

టెక్​ మహీంద్రా, రెడ్డీస్​ ల్యాబ్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్, హెచ్​యూఎల్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

కరోనా భయాలు ఉన్నప్పటికీ కోస్పీ, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్ రాణిస్తున్నాయి. నిక్కీ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. వాల్​స్ట్రీట్​ నిన్న నష్టాలతో ముగిసింది.

రూపాయి విలువ

ప్రస్తుతం రూపాయి విలువ 5 పైసులు తగ్గి, ప్రస్తుతం డాలరుకు రూ.71.31గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.12 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 56.27 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఏం స్పీడు గురూ: 6.1 సెకెన్లలో 100 కి.మీ వేగం!

Last Updated : Mar 1, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details