పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య నిర్వహణాధికారి సందీప్ కుమార్ సుల్తానియా అధ్యక్షతన 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి రుణ వితరణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి బ్యాంకు అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ కిషన్ శర్మ, ఎస్‌బీఐ హైదరాబాద్ ఏజీఎం, నాబార్డ్, 15 ప్రధాన బ్యాంకుల జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా రుణ వితరణ ప్రగతి, ప్రగతి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్‌ఈఆర్‌పీ డైరెక్టర్ నర్సింహారెడ్డి బ్యాంకు లింకేజి రుణ సమగ్ర ప్రగతి లక్ష్యాలను, సాధించిన ప్రగతిని వివరించారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి రుణ వితరణకు సంబంధించిన సమగ్ర ప్రగతి లక్ష్యాన్ని 66 శాతం సాధించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.
రుణ వితరణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి బ్యాంకు అధికారుల సమావేశం - హైదరాబాద్ వార్తలు
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజి రుణ వితరణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి బ్యాంకు అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రుణ వితరణ ప్రగతి, ప్రగతి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
3లక్షల 13వేల 359 సంఘాలకు రూ.8563.85 కోట్లు... లక్షా 48 వేల 330 సంఘాలకు రూ.5,660 కోట్లు అందించామన్నారు. అదే విధంగా అప్పు 3లక్షల 47వేల 900 సంఘాలపై రూ.11,060 కోట్లుగా ఉందన్నారు. ఎన్‌పీఏ 2.4 శాతంగా ఉందన్నారు. కొవిడ్ రిలీప్ కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు లక్షా 25వేల 700 సంఘాలకు రూ.676 కోట్లు అందజేశాయన్నారు. దీనిపై సందీప్ కుమార్ సుల్తానియా బ్యాంకు అధికారులను అభినందించారు. మిగిలిన లక్ష్యాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. అదే విధంగా సంఘాలకు ఇచ్చే రుణాల పరిమాణం 10 లక్షలకు పెంచాలన్నారు. తద్వారా ఆదాయాభివృద్ధి, పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు.
ఇవీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు