తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా'

ఏటీఎంలలో నగదు కొరత కారణంగా బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యంత్రాల్లో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే సంబంధిత బ్యాంకుపై 10 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.

RBI
ఏటీఎం

By

Published : Aug 11, 2021, 5:16 AM IST

Updated : Aug 11, 2021, 6:55 AM IST

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యంత్రాల్లో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం (డబ్ల్యూఎల్‌ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి:'డిసెంబరుకు డిజిటల్‌ కరెన్సీ నమూనా'

Last Updated : Aug 11, 2021, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details