ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఐపీఓ(Star health IPO) సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 30న(Star health IPO) ప్రారంభం కానుంది. డిసెంబరు 2న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 29న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. ఒక్కొ షేరు ధర రూ.870-900 గా(Star health IPO price) నిర్ణయించింది.
మొత్తం రూ.7,249 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్. ఇందులో రూ.2000 కోట్లు విలువైన షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మరో 58,324,225 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు.
పబ్లిక్ ఇష్యూలో.. సంస్థలో పని చేసే ఉద్యోగుల కోసం రూ.100 కోట్లు విలువైన షేర్లను రిజర్వు చేసింది. ఇష్యూ పరిమాణంలో 75 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్‌కు (క్యూఐబీలు), 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలకు, మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ చేయనుంది.
స్టార్ హెల్త్.. దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్థ. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala Airlines) వంటి పెట్టుబడిదారుల కన్సార్టియం యాజమాన్యంలో ఉంది.
మరో ఏడు కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్
తాజాగా ఏడు కంపెనీల ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోద ముద్ర వేసింది.
మెడ్‌ప్లస్
మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్(medplus health ipo).. మొత్తం రూ.1,639 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఐపీఓ దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.600 కోట్లు విలువైన షేర్లు ఇష్యూ చేయనుండగా.. మరో రూ.1,038.71 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది.
రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్
తాజా షేర్ల ద్వారా రూ.400 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 2.26 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, సాంకేతిక అభివృద్ధి, కృత్రిమమేధ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది కంపెనీ.