తెలంగాణ

telangana

ETV Bharat / business

'క్లాస్​రూమ్​కు దీటుగా 'ఇన్ఫినిటీ లెర్న్​' ఆన్​లైన్​ పాఠాలు'

లాక్​డౌన్​ నేపథ్యంలో విద్యార్థులకు క్లాస్​రూమ్​ తరహా పాఠాలను ఆన్​లైన్​లో అందించేందుకు ఇన్ఫినిటీ లెర్న్​ అనే అంకుర సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్​ సుష్మ బొప్పన. ఇంటర్‌, నీట్‌, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల అండదండలతో పాఠాలు, స్టడీ మెటీరియల్‌, నమూనా పరీక్షలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు

sri chaitanya junior college
క్లాస్​రూమ్​కు దీటుగా 'ఇన్ఫినిటీ లెర్న్​' ఆన్​లైన్​ పాఠాలు

By

Published : Nov 17, 2021, 9:37 AM IST

కొవిడ్‌ వల్ల గత ఏడాదిలో క్లాస్‌రూమ్‌ల నిర్వహణ సాధ్యం కాలేదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో వెనుకబడి పోతారని ఆందోళన చెందాం. అందుకే శ్రీచైతన్య విద్యార్థులతో పాటు, దేశవ్యాప్తంగా ఇతర విద్యార్ధులకూ క్లాస్‌రూమ్‌ పాఠాలకు దీటుగా ఆన్‌లైన్లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే లక్ష్యంతో 'ఇన్ఫినిటీ లెర్న్‌' అనే ఎడ్యుటెక్‌ అంకుర సంస్థను ఫిబ్రవరిలో ఏర్పాటు చేశాం' అని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌, 'ఇన్ఫినిటీ లెర్న్‌' సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన వివరించారు. ఇంటర్‌, నీట్‌, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల అండదండలతో పాఠాలు, స్టడీ మెటీరియల్‌, నమూనా పరీక్షలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ బోధనలో విప్లవాత్మక మార్పుల ద్వారా దేశంలో అత్యుత్తమ ఎడ్యుటెక్‌ కంపెనీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు 'ఈనాడు'కు తెలిపారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే..

నీట్‌, జేఈఈ విద్యార్థులకు అండగా..

నీట్‌, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం, నమూనా పరీక్షలు నిర్వహించడం, సందేహాలు తీర్చడం మా ఎడ్యుటెక్‌ సంస్థ ప్రధానోద్దేశం. ఈ దిశగా వినూత్న 'డిజిటల్‌' వ్యూహాలను ఆవిష్కరిస్తున్నాం. క్లాస్‌రూమ్‌ తరహాలో పాఠాన్ని విద్యార్థులు శ్రద్ధగా ఆలకిస్తున్నదీ, లేనిదీ ఆన్‌లైన్‌లో బోధిస్తున్న టీచర్‌ గమనించే టూల్స్‌ రూపొందిస్తున్నాం.

వేలసంఖ్యలో డౌన్‌లోడ్లు

ఇప్పటికే వేలమంది విద్యార్థులు మా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆన్‌లైన్లో ఒకేసారి ఎంత మందికైనా పరీక్ష పెట్టగల సత్తా మాకు ఉంది. నీట్‌, జేఈఈ 'లాంగ్‌టెర్మ్‌' విద్యార్థులు కచ్చితమైన ఫలితాలు సాధించడానికి వీలుగా క్లాస్‌రూమ్‌ శిక్షణకు 'డిజిటల్‌' లక్షణాలను జోడించి 'హైబ్రిడ్‌ ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌' అనే కోర్సును ఆవిష్కరించాం. విద్యార్థులకు త్వరలో సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌, ఇంగ్లీషు లాంగ్వేజ్‌ పాఠాలు, సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ కోర్సులు అందించే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా సంస్థకు నెల- వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు, టెస్ట్‌ ఛార్జీల రూపంలో ఆదాయం లభిస్తుంది. 'అమెజాన్‌ అకాడమీ'తో ఇటీవల భాగస్వామ్యం కుదిరింది. దీని ప్రకారం నీట్‌, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అమెజాన్‌ అకాడమీకి మేం అందిస్తున్నాం.

50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి

'ఇన్ఫినిటీ లెర్న్‌' పై 50 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.375 కోట్లు) వరకు పెట్టుబడి పెడుతున్నాం. ఇటీవల 'టీచర్‌' యాప్‌ను కొనుగోలు చేశాం. ఒక యూకే కంపెనీ నుంచి 'వి బాక్స్‌' అనే 'కామ్‌ఐ ప్రోడక్ట్స్‌' కూడా కొన్నాం. విద్యార్థులు కంప్యూటర్‌ ముందు ఎంత సేపు ఉంటున్నారు, పాఠం వింటున్నారా లేక సిస్టమ్‌ ఆన్‌లో పెట్టి, వేరే పని చేసుకుంటున్నారా.. అనేది 'వి బాక్స్‌' ద్వారా గమనించవచ్చు. మరో మూడు యాప్స్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. 'డిజిటల్‌ లెర్నింగ్‌' సొల్యూషన్స్‌ వ్యాపారంలో లాభాలు ఆర్జించే (బ్రేక్‌-ఈవెన్‌) దశకు రావటానికి ఎంతో సమయం పడుతుంది. అందువల్ల 'వ్యూహాత్మక ఇన్వెస్టర్ల' కు వచ్చే ఏడాది చివర్లో కొంత వాటా విక్రయించి నిధులు సమీకరించే ఆలోచన ఉంది. 2023 నాటికి దేశంలోని అగ్రగామి-5 ఎడ్యుటెక్‌ కంపెనీల్లో ఒకటిగా నిలవాలని, 100 కోట్ల డాలర్ల సంస్థాగత విలువ సాధించాలని ఆశిస్తున్నాం.

ఇదీ చూడండి:-72 విమానాలు కొంటున్న ఝున్​ఝున్​వాలా.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details