రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్ ఆవిష్కరించిన 'స్పుత్నిక్ వి' కొవిడ్-19 టీకాను మనదేశానికి చెందిన స్టెలిస్ బయోఫార్మా తయారుచేయనుంది. దాదాపు 20 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. స్టెలిస్ బయోఫార్మా.. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్‌కు బయోఫార్మాస్యూటికల్స్ విభాగం. మనదేశంలో ఆర్‌డీఐఎఫ్ తరఫున భాగస్వామిగా ఉన్న ఎస్నో హెల్త్‌కేర్ ఎల్‌ఎల్‌పీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టెలిస్ బయోఫార్మా పేర్కొంది.
ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి టీకా సరఫరా ప్రారంభించాల్సి ఉంది. అవసరాలను బట్టి ఇంకా అధిక డోసులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు 'స్టెలిస్' వివరించింది. స్పుత్నిక్ వి టీకాను పెద్ద సంఖ్యలో సరఫరా చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆర్‌డీఐఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిరిల్ డిమిట్రివ్ పేర్కొన్నారు.
యూకేకు ఎక్కువ టీకాలు..