తెలంగాణ

telangana

ETV Bharat / business

స్పైస్‌జెట్‌లో భారత్​కు 800 ఆక్సిజన్‌ మిషన్లు

దేశంలో కరోనా విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన వేళ హాంకాంగ్‌ నుంచి ఎనిమిది వందల ఆక్సిజన్‌ మిషన్లు ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు భారత్​కు తీసుకురానున్నట్లు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో వివిధ దేశాల నుంచి 10 వేల ఆక్సిజన్‌ మిషన్లు తీసుకరానున్నట్లు వెల్లడించారు.

SpiceJet
స్పైస్‌జెట్‌

By

Published : Apr 25, 2021, 4:56 AM IST

దేశంలో కరోనా విలయ తాండవం కారణంగా దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు స్పైస్​ జెట్​ విమాన సంస్థ సిద్ధమైంది. హాంకాంగ్‌ నుంచి ఎనిమిది వందల ఆక్సిజన్‌ మిషన్లు ఆదివారం భారత్​కు తీసుకురానున్నట్లు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ తెలిపారు. ఈ పరికరాలతో హాంగ్‌కాంగ్‌ నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్‌ రవాణా విమానం కోల్‌కతా మీదుగా దిల్లీ చేరనున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో వివిధ దేశాల నుంచి 10 వేల ఆక్సిజన్‌ మిషన్లు తీసుకరానున్నట్లు వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ దేశ ప్రజలకు సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి :అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న నలుగురు వ్యోమగాములు

ABOUT THE AUTHOR

...view details