దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి టెలికాం శాఖ.. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య వేలం నిర్వహించే అవకాశం ఉందని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తెలిపింది. ఒకవేళ రిజర్వ్ ధర ఎక్కువగా ఉంటే తాము వేలంలో పాల్గొనబోమని ఆ కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ తెలిపారు. ప్రస్తుతం స్పెక్ట్రం వేలం గురించే కంపెనీ ఆలోచన చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి లోపల, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు 1000 ఎంఏహెచ్ ఫ్రీక్వెన్సీ కొనుగోలుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
"జనవరి నుంచి మార్చి మధ్య టెలికాం విభాగం వేలం నిర్వహించే అవకాశం ఉందని మేం విన్నాం. ఒకవేళ 5జీకి రిజర్వ్ ధర ఎక్కువగా ఉంటే బిడ్‌లో పాల్గొనం. అంత ధరను మేం భరించలేం" అని గోపాల్ చెప్పుకొచ్చారు.