తెలంగాణ

telangana

'ఫేస్​బుక్​ డౌన్​'పై మార్క్ క్షమాపణ.. నెటిజన్ల ట్రోలింగ్

By

Published : Oct 5, 2021, 9:57 AM IST

Updated : Oct 5, 2021, 2:05 PM IST

సేవలకు అంతరాయం కలగడంపై ఫేస్​బుక్ (Facebook Server Down) సీఈఓ మార్క్ జుకర్​బర్గ్.. యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. ఫేస్​బుక్ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని తెలుస్తుండగా.. నెటిజన్లు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫేస్​బుక్​పై ట్రోల్ చేస్తున్నారు.

Sorry for the disruption, says Zuckerberg as FB, WhatsApp services return online
సేవల అంతరాయంపై జుకర్​బర్క్ క్షమాపణ.. నెటిజన్ల ట్రోలింగ్

ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై (Facebook Server Down) మార్క్ జుకర్​బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్​లైన్​లోకి వచ్చినట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు.

వాట్సాప్ (Whatsapp not working) సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది. (Whatsapp down)

కోటి రిపోర్టులు

అంతర్జాల సమస్యలపై దృష్టిసారించే డౌన్​డిటెక్టర్.. ఫేస్​బుక్ అంతరాయంపై (Facebook Server Down) కీలక ప్రకటన చేసింది. ఫేస్​బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా రిపోర్టులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్​బుక్​ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం (Facebook Down) ఇదేనని వెల్లడించింది.

ట్విట్టర్​లో ట్రోల్స్..

మంగళవారం రాత్రి ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు (Facebook Server Down) నిలిచిపోయాయి. భారత్‌ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌ వినియోగదారులూ ఇబ్బందులు (Facebook Down) ఎదుర్కొన్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి:వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలకు అంతరాయం

ఏం జరిగిందో తెలియక వినియోగదారులు పలువురికి ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నారు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు వెళ్లకపోవడంతో తొలుత పలువురు తమ మొబైల్‌ నెట్‌వర్క్‌, వైఫై పనిచేయక పోవడమే కారణమని భావించారు. దీనిపై నెటిజెన్స్‌ మీమ్స్‌ (Facebook down meme) కూడా రూపొందించారు. 'వాట్సాప్‌కు ఏమైందో తెలియాలంటే ట్విటర్‌లోకి వెళ్లాలి పదండి' అంటూ ఫన్నీ మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు నెటిజన్లు.

.
.
.
.
.
.
.
.
.
.
Last Updated : Oct 5, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details