సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ తన వెబ్ వెర్షన్లో మార్పులు చేయబోతోంది. ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న తన క్లాసిక్ లుక్కు త్వరలోనే గుడ్‌బై చెప్పనుంది. యూజర్లందరికీ కొత్త లుక్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
మనం ఫేస్బుక్ తెరవగానే నీలం చార, తెలుపు, నలుపు అక్షరాలు దర్శనమిస్తాయి. ఏళ్లుగా ఇదే యూఐలో ఫేస్బుక్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తోంది. తాజాగా కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొందరికి ప్రయోగాత్మకంగా ఈ లుక్ అందుబాటులోకి తెచ్చింది. వారికి తమ పాత లుక్‌లో మారేందుకు వీలుగా డ్రాప్‌డౌన్ మెనూలో క్లాసిక్ లుక్కు మారే వీలు కల్పిస్తోంది. అయితే, సెప్టెంబర్ నుంచి ఇక క్లాసిక్ లుక్కు గుడ్‌బై చెప్పాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఇకపై అందరికీ న్యూ లుక్ మాత్రమే కనిపించనుంది.