మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చమురుపై పన్నులు తగ్గించినంత మాత్రన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావమేమీ పడబోదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై భారం పడకుండా పన్నులు తగ్గించవచ్చని సూచించారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ప్రధాన్.. ఇంధన ధరల పన్నులను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదో కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే విస్పష్టంగా సమాధానమిచ్చారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చని సూచించారు. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని, ముఖ్యంగా ముంబయిలో పన్నుల భారం ఎక్కువగా ఉందని చెప్పారు. అటువంటి చోట పన్నులను కొంతైనా తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.