తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆర్థిక బలోపేతానికి అందరం కృషి చేయాలి' - ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తాజా వార్తలు

ఆర్థిక స్థిరత్వం అనేది ప్రజా ప్రయోజనాలకు మేలు చేసేదిగా ఉండాలి అభిప్రాయపడ్డారు ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​. అయితే దానిని ప్రజలే కాపాడుకోవాలని తెలిపారు. గతేడాది మానవ సమాజానికి అత్యంత గడ్డుకాలంగా అభివర్ణించారు.

rbi
బ్యాంకులు,ఎన్​బీఎఫ్​సీలను బలోపేతం చేస్తాం: ఆర్​బీఐ

By

Published : Jan 16, 2021, 1:01 PM IST

Updated : Jan 16, 2021, 4:13 PM IST

కరోనా కారణంగా మానవ సమాజానికి 2020 సంవత్సరం అత్యంత కష్టమైన ఏడాదిగా మిగిలిపోయిందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు మేలు చేశాయని చెన్నైలో తెలిపారు. కొవిడ్‌ వల్ల అసాధారణమైన ఆర్థిక, ఆరోగ్య ఉపద్రవం ఏర్పడిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వివేకంతో కూడిన, న్యాయబద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడమే ప్రాథమిక ఉద్దేశ్యంగా ఉండాలని అన్నారు. ఆర్థిక స్థిరత్వానికి కట్టుబడుతూనే.... భవిష్యత్తులో అవసరమైతే ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా ఆర్బీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఆర్థిక సంస్థలపై ప్రత్యేక దృష్టి..

బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది ఆర్​బీఐ. సంబంధిత సంస్థల్లో పాలనను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తెలిపారు. రానున్న రోజుల్లో విధానపరమైన నిర్ణయాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కేంద్రం ఖర్చు తగ్గించడం ఆందోళనకరం: రంగరాజన్​

Last Updated : Jan 16, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details