పొదుపు ఖాతాలో అత్యధిక సగటు బ్యాలెన్స్ కొనసాగించే వారికి కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఈ ప్రకటన పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తం నగదు నిల్వ ఉంచేలా ఆశ పెడుతుంది. కానీ, ఇక్కడ ఓ కిటుకు ఉంది. బ్యాంకు చెప్పిన వడ్డీ రేటు మీ మొత్తం బ్యాలెన్స్‌కు వర్తించదు. అందులో కొంత మొత్తానికి మాత్రమే గరిష్ఠ వడ్డీ రేటు వర్తిస్తుంది. అదేలాగో చూద్దాం.
బ్యాంకులకు పొదుపు ఖాతాల ద్వారా నగదు సమీకరణ చాలా తక్కువ వడ్డీకి, సులభంగా వస్తుంది. అందుకే చిన్న బ్యాంకులు శ్రేణి ఆధారిత వడ్డీ రేటు వ్యవస్థను అనుసరిస్తాయి. ఉదాహరణకు ఉత్కర్శ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. పొదుపు ఖాతాలో రూ.1 లక్ష వరకు 5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల వరకు 6 శాతం వడ్డీ ఇస్తుంది. ఒకవేళ అంతకు మించి నగదును పొదుపు ఖాతాలో ఉంచితే మీరు 7.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.
అదే విధంగా.. బంధన్ బ్యాంక్ పొదుపు ఖాతాల్లో రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ నిల్వ ఉంచితే 3 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ, ఖాతాలో లక్ష నుంచి రూ.10 కోట్ల లోపు ఉంటే ఈ విలువ 6 శాతం వరకు అందుతుంది. రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటే 6.55 శాతం, రూ.50 కోట్లకుపైగా ఉంటే 7.15 శాతం మేర వడ్డీ ఇస్తోంది బంధన్ బ్యాంకు.
మొత్తం నగదుకు గరిష్ఠ రేటు వర్తించదు..