సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 7% వృద్ధి కనిపించింది. కొవిడ్-19 ప్రభావం ఉన్నా, కంపెనీలు వేగంగా డిజిటలీకరణ వైపు అడుగులు వేయడం మూలంగా ఐటీ రంగానికి గిరాకీ ఏర్పడింది.
సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు - software
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఈసారి ఊపందుకున్నాయి. కరోనాతో ఇతర రంగాలు కుదేలైన వేళ అవి 7 శాతం వృద్ధి నమోదుచేశాయి.
ఎస్‌టీపీఐ, సాఫ్ట్‌వేర్ ఎగుమతులు
ఐటీ నిపుణులు ఎక్కడినుంచైనా పనిచేసే వీలు కలగడం వల్ల ఐటీ పరిశ్రమ ఉత్పాదకతకు ఎటువంటి అవరోధాలు కలుగలేదు. ఎస్‌టీపీఐ దగ్గరున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, 2020-21లో ఎస్‌టీపీఐ నమోదిత సంస్థల ఎగుమతులు 7%పెరిగి, రూ.5.0 లక్షల కోట్లకు చేరాయి.