తెలంగాణ

telangana

ETV Bharat / business

Snapdeal Ipo: ఐపీఓకు స్నాప్​డీల్​.. సమీకరణ ఎంతంటే? - పబ్లిక్‌ ఇష్యూకు ఈ కామర్స్​ దిగ్గజం స్నాప్​డీల్​

మార్కెట్లో ఐపీఓల హవా నడుస్తోంది. దీంతో ప్రముఖ ఈ కామర్స్​ దిగ్గజం స్నాప్​డీల్​ పబ్లిక్‌ ఇష్యూకు(Snapdeal Ipo) వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 300 నుంచి 400 మిలియన్​ డాలర్లు సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Snapdeal assessing IPO
ఐపీఓకు స్నాప్​డీల్

By

Published : Sep 4, 2021, 5:01 AM IST

Updated : Sep 4, 2021, 9:41 AM IST

దేశీయ ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ పబ్లిక్‌ ఇష్యూకు (Snapdeal Ipo) వెళ్లే యోచనలో ఉంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా సుమారు రూ.3000 కోట్లను (40 కోట్ల డాలర్లు) సమీకరించాలని కంపెనీ(Snapdeal news) అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సలహాదారులతో ఈ విషయమై స్నాప్‌డీల్‌ సంప్రదింపులు జరుపుతోందని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ విలువను 250 కోట్ల డాలర్లుగా (రూ.18,500 కోట్లు) అంచనా వేసినట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ ఐపీఓ ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపాయి. ఈ వార్తలపై స్పందించేందుకు స్నాప్‌డీల్, ఈ సంస్థలో పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్‌ తరపు ప్రతిధులు నిరాకరించినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

పబ్లిక్‌ ఇష్యూకు ఇన్ఫినియన్‌ బయోఫార్మా

పబ్లిక్‌ ఇష్యూకు అనుమతి నిమిత్తం సంబంధిత దరఖాస్తు పత్రాలను సెబీకి ఇన్ఫినియన్‌ బయోఫార్మా సమర్పించింది. ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మోబియస్‌ బయోమెడికల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, చర్మ సంరక్షణ, మహిళల ఆరోగ్య ఉత్పత్తుల అభివృద్ధికి లైసెన్సుల కొనుగోలుకు, నిర్వహణ మూలధన అవసరాలకు కంపెనీ ఉపయోగించనుంది.

ఈఎస్‌డీఎస్‌ సాప్ట్‌వేర్‌

క్లౌడ్‌ సేవలు, డేటా సెంటర్‌ సంస్థ ఈఎస్‌డీఎస్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ ద్వారా రూ.1,200-1,300 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి దరఖాస్తు పత్రాలను ఈ నెలలోనే సెబీకి ఈ కంపెనీ దరఖాస్తు చేసే అవకాశం ఉంది.

పబ్లిక్‌ ఇష్యూకు తొందరేమీ లేదు: ఫోన్‌పే

పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు తమకు తొందరేమీ లేదని ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెలిపారు. తగిన సందర్భం వచ్చినప్పుడు, సరైన కారణం ఉంటే కచ్చితంగా ఐపీఓపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫోన్‌పే పోటీ సంస్థ పేటీఎం సహా పలు దేశీయ ఇంటర్నెట్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీర్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌పే కొత్తగా ‘పల్స్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దేశంలోని డిజిటల్‌ చెల్లింపుల ధోరణుల, విశ్లేషణలు తదితర వివరాలను ఇది తెలియజేస్తుంది. గత అయిదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులపై లోతైన అధ్యయనంతో కూడిన పల్స్‌ రిపోర్ట్‌ను కూడా ఫోన్‌పే విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్‌ ప్రకారం.. జూన్‌ త్రైమాసికంలో 394.13 కోట్ల ఫోన్‌పే లావాదేవీలు (యూపీఐ, కార్డులు, వ్యాలెట్‌లు) జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.7.47 లక్షల కోట్లు. ఒక్కో లావాదేవీ సగటు విలువ రూ.1,897.

ఇదీ చూడండి:దేశంలో ఎన్​ఎఫ్టీఇఫీ కార్యకలాపాలు షురూ..!

Last Updated : Sep 4, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details