తెలంగాణ

telangana

ETV Bharat / business

దూసుకెళ్తున్న స్నాప్​చాట్​.. 6 కోట్లకు యూజర్లు - snap md nana murugeshan

భారత్​లో ఫొటో మెసేజింగ్‌ యాప్‌ 'స్నాప్‌చాట్‌' దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఈ యాప్​ను 6 కోట్ల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు. డైలీ యాక్టివ్‌ యూజర్ల‌ సంఖ్య 150 శాతం పెరిగింది.

snapchat users in india
దేశంలో 6 కోట్ల స్నాప్‌చాట్‌ యూజర్లు

By

Published : Feb 14, 2021, 6:55 PM IST

ఫొటో మెసేజింగ్‌ యాప్‌ 'స్నాప్‌చాట్‌' యూజర్ల సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకూ ఈ యాప్‌ను ఆరు కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రోజువారీ క్రియాశీల వినియోగదారుల(డైలీ యాక్టివ్‌ యూజర్స్‌-డీఏయూ) సంఖ్య 150 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూజర్లకు మరింత నాణ్యమైన సేవల్ని అందించేందుకు కృషి చేస్తున్నామని యాప్‌ మాతృసంస్థ 'స్నాప్' ఎండీ నానా మురుగేశన్‌ తెలిపారు.

స్థానిక సంస్కృతికి తగ్గట్టుగా..

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌చాట్‌కి 265 మిలియన్ల యూజర్లు ఉన్నారు. యాప్‌లో రోజుకు సగటున ఐదు బిలియన్‌ స్నాప్‌లు క్రియేట్‌ అవుతున్నాయి. 2020 తమ యాప్‌ కార్యకలాపాలు బలపడ్డాయని మురుగేశన్‌ తెలిపారు. యాప్‌ వృద్ధి చెందిన తీరుతో కంపెనీ సంతృప్తిగా ఉందన్నారు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) సాంకేతికత వల్ల ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పారు. ఏఆర్‌ను మరింత విస్తృతంగా వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక సంస్కృతికి తగ్గట్టుగా మరిన్ని ఫీచర్లు, ఫొటో లెన్స్‌లు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా యూజర్ల అనుభూతిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

భారత యూజర్లు యాప్‌ను వినియోగించడమే కాకుండా.. అనేక రకాల లెన్స్‌లను అభివృద్ధి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని మురుగేశన్‌ తెలిపారు. వివేక్ ఠాకూర్ రూపొందించిన 'స్మోక్ ఫ్లేర్ లెన్స్‌'.. భారత్‌లో పాటు దక్షిణాసియాలో అత్యంత ఆదరణ పొందిందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:అనవసర ఖర్చులకు కళ్లెం వేద్దామిలా..

ABOUT THE AUTHOR

...view details