కరోనాతో స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. కెనాలిస్ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్-జూన్ మధ్య 2019 ఇదే సమయంతో పోలిస్తే స్మార్ట్ఫోన్ల విక్రయాలు 48 శాతం తగ్గినట్లు తెలిసింది. 2020 ఏప్రిల్-జూన్ మధ్య 1.73 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 3.3 కోట్లుగా ఉండటం గమనార్హం.
కరోనాతో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 48 శాతం డౌన్! - స్మార్ట్ఫోన్ల విక్రయాలపై లాక్డౌన్ ప్రభావం
కరోనా కారణంగా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో ఈ ఏడాది ఏప్రిల్-నుంచి జూన్ మధ్య స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2019 ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం పడిపోయాయి. శాంసంగ్ అమ్మకాలు అత్యధికంగా 60 శాతం పడిపోయాయి.
స్మార్ట్ఫోన్ల విక్రయాలు
ఏ కంపెనీపై ఎంత ప్రభావం
- కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ అత్యధికంగా ప్రభావితమైంది. లగ్జరీ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థపై లాక్డౌన్ ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు కెనాలిస్ నివేదిక వెల్లడించింది.
- స్మార్ట్ఫోన్ల విపణిలో అగ్రస్థానంలో ఉన్న షియోమీ విక్రయాలు 2020 ఏప్రిల్-జూన్ మధ్య 48 శాతం తగ్గాయి. దీనితో మార్కెట్లో సంస్థ వాటా 31.3 శాతం నుంచి 30.9 శాతానికి పడిపోయాయి.
- వివో మొబైల్ ఫోన్ల విక్రయాలు 36 శాతం తగ్గాయి. 2019 ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే 2020 ఇదే సమయానికి వివో మార్కెట్ వాటా 17.5 శాతం నుంచి 21.3 శాతానికి పెరిగింది.
- శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు అత్యధికంగా 60 శాతం తగ్గాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంస్థ వాటా 22.1 శాతం నుంచి 16.8 శాతానికి పడిపోయింది.
- ఒప్పో, రియల్మీ స్మార్ట్‌ఫోన్ సంస్థల విక్రయాలు 2020 క్యూ2లో వరుసగా 27 శాతం, 35 శాతం పడిపోయాయి. దీనితో మార్కెట్ వాటా పరంగా రియల్‌మీని వెనక్కినెట్టి ఒప్పో నాలుగో స్థానానికి ఎగబాకింది.
- యాపిల్ ఫోన్ల షిప్మెంట్లు 20 శాతం తగ్గాయి. లాక్డౌన్లో టాప్ 10 స్మార్ట్ఫోన్ల కంపెనీల్లో అత్యల్పంగా ప్రభావితమైన సంస్థ ఇదే కావడం గమనార్హం.
Last Updated : Jul 18, 2020, 4:16 PM IST