భారీగా డబ్బు వెచ్చించి ఇల్లు కొనుక్కున్నప్పటికీ.. మంచి ఇంటీరియర్ లేకుంటే సొంతింటి ఆహ్లాదాన్ని ఆస్వాదించలేరు. ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అభిరుచులకు తగ్గట్లు.. తక్కువ ఖర్చులో ఇంటీరియర్ కావాలనుకుంటారు చాలా మంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమేనంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లోరింగ్
ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించినంత వరకు ఫ్లోరింగ్ కీలకమైంది. మార్కెట్‌లో వివిధ రకాల ఫ్లోరింగ్ డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. సరైన ప్రణాళికతో బడ్జెట్ ధరలో మంచి ఫ్లోరింగ్‌ను నిర్మించుకోవచ్చు. అందుబాటు ధరలో ఆకర్షణీయంగా ఉండే ఫ్లోరింగ్ కావాలంటే టైల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
టైల్స్.. పలు ఆకారాలు, పరిమాణాలు, డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా టైల్స్.. పాలరాయి, చెక్క ఫ్లోరింగ్ కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఫ్లోరింగ్ టైల్స్ ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కంపెనీల సేల్స్ నిర్వహిస్తాయి. ఇందులో డిస్కౌంట్ ధరలకే రకాల ఫ్లోరింగ్ సామగ్రి కొనుగోలు చేసుకోవచ్చు.
పెయింట్స్
గోడలకు పెయింట్స్ కూడా ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ. పెయింట్ లేకపోతే ఇంటికి కళ ఉండదు. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న పెయింట్స్‌ను వాడటం వల్ల ఇంటీరియర్ ఖర్చు తగ్గించుకోవచ్చు. పెయింటింగ్‌కు ముందు గోడలపై ప్రైమర్‌ను ఉపయోగించటం వల్ల పెయింటింగ్‌పై కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు. ప్రైమర్ వల్ల పెయింట్ వినియోగం తగ్గుతుంది. గోడలూ ఆకర్షణీయంగా మారతాయి.
మంచి నాణ్యమైన పెయింట్లను ఎంచుకోవటం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. నాణ్యమైన పెయింట్లు ఉపయోగించినట్లయితే తక్కువ కోటింగ్‌లు సరిపోతాయి. అంతేకాకుండా ఎక్కువకాలం పెయింట్ మన్నికగా ఉంటుంది. తక్కువ రంగులు ఉపయోగించటం వల్ల మిగులు తగ్గిపోతుంది. ఎక్కువ పెయింట్స్ ఉపయోగించినట్లయితే.. ఒక్కో దానిలో కొంచెం కొంచెం మిగిలినా కూడా మొత్తంగా మిగులు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు పెరిగిపోతుంది. అందుకే పెయింట్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. పెయింట్ ఎంత అవసరం పడుతుంది? అన్న విషయంలో ఆన్లైన్లో పలు వెబ్‌సైట్స్‌ను ఉపయోగించి అంచనా వేసుకోవచ్చు.