తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదాయం లేకున్నా.. ఐటీఆర్​ ఫైలింగ్ తప్పనిసరి! - tds return filing

వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కన్నా తక్కువే ఉంది కదా అని రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. పన్ను పరిధిలో లేకున్నా కూడా కొన్ని సార్లు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆయా సందర్భాలు ఏంటో తెలుసుకుందాం?

ITR filing
ఐటీఆర్​ ఫైలింగ్​

By

Published : Aug 26, 2021, 10:50 PM IST

సెప్టెంబర్ 30,2021తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు ముగియనుంది. పన్ను స్లాబులో ఆదాయం లేకుంటే ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆదాయం పరిమితి లేకున్నా కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. అవేంటి ఓసారి చూద్దాం?

ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు మాత్రమే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. దీనితో పాటు మరికొన్ని సందర్భాల్లో కూడా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి తప్పనిసరి నిబంధన లేకపోయినప్పటికీ రిటర్నులు దాఖలు చేయాలి.

టీడీఎస్

కొన్ని లావాదేవీలు విషయంలో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ద్వారా పన్నును ప్రభుత్వం పొందుతుంది. ఇది చేసే సమయంలో పన్ను పరిధి పరిగణనలోకి తీసుకోదు. సాధారణంగా డివిడెంట్​తో పాటు పలు సందర్భాల్లో టీడీఎస్ వర్తిస్తుంది. ఒకవేళ టీడీఎస్ చెల్లించిన వ్యక్తి పన్ను పరిధిలో లేనట్లయితే ఆ మేరకు పన్ను మళ్లీ పొందవచ్చు. దీనికోసం రిటర్నులు దాఖలు చేయాలి.

ఆస్తుల విషయంలో

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పన్ను పరిమితి స్లాబులో లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలి. ఆస్తులు ఎక్కడున్నాయన్నది కూడా రిటర్నులు దాఖలు చేయటాన్ని నిర్ణయిస్తుంది. స్వదేశంలో ఆస్తులు ఎక్కడున్నా... స్లాబులో లేకపోతే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఆస్తులు ఉన్నప్పుడు, విదేశాల్లో ఖాతా ఉన్నప్పుడు రిటర్నులు ఫైల్ చేయాలి.

విదేశీ ప్రయాణాలు కూడా ఐటీ రిటర్నుల దాఖలును నిర్ణయిస్తాయి. స్వతహాగా ప్రయాణం చేసినా, ఇతరుల విషయంలో ఖర్చు పెట్టినా ఇది వర్తిస్తుంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేసినప్పుడు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఖాతాలో జమ చేసిన మొత్తంపై..

బ్యాంకు ఖాతాలో జమ చేసిన మొత్తం ఒక పరిమితిని దాటినట్లయితే మొత్తం ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినప్పుడు రిటర్నులు ఫైల్ చేయాలి.

విద్యుత్ బిల్లులు

విద్యుత్ బిల్లు కూడా రిటర్నులు దాఖలు చేయటానికి ఒక నిబంధనగా ఉంది. మొత్తంగా విద్యుత్ బిల్లు రూ. 1 లక్ష కంటే ఎక్కువ కట్టినట్లయితే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఐటీ రిటర్నులు దాఖలు చేసుకోవటం ఉత్తమం. విదేశీ ఎంబసీలు 2-3 సంవత్సరాల రిటర్నులను సమర్పించాలని కోరుతుంటాయి. అంతేకాకుండా దేశీయంగా వివిధ రుణాలు, క్రెడిట్ కార్డుల మంజూరు కోసం ఐటీ రిటర్నులు అవసరం ఉంటుంది. ఐటీ రిటర్నులు ఉన్నట్లయితే ప్రాసెసింగ్ మరింత సులభతరం అవుతుంది.

ఇదీ చూడండి:సెప్టెంబర్​ 1 నుంచి విజయ డయాగ్నోస్టిక్ ఐపీఓ

ABOUT THE AUTHOR

...view details