తెలంగాణ

telangana

ETV Bharat / business

సీఎంలతో నేడు నిర్మల కీలక భేటీ- అజెండా ఇదే.. - నిర్మలా సీతారామన్ మీటింగ్

నేడు(నవంబర్ 15) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమావేశం కానున్నారు. ప్రైవేటు పెట్టుబడులు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

nirmala sitaraman
నిర్మలా సీతారామన్

By

Published : Nov 15, 2021, 5:16 AM IST

Updated : Nov 16, 2021, 12:45 PM IST

ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై దృష్టి సారించిందన్నారు.

'పెట్టుబడులకు భారత్​ ప్రధాన కేంద్రంగా మారుతోంది.. ప్రైవేటు రంగం కూడా ఆసక్తి కనబరుస్తోంది' అని సోమనాథన్​ పేర్కొన్నారు. భూమి, నీటి వినియోగంపై ఉన్న నిబంధనలు సడలించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్​ సేఠ్​ వెల్లడించారు.

Last Updated : Nov 16, 2021, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details