బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వాహనాల స్టార్టప్.. 'సింపుల్ ఎనర్జీ' తొలి ఈ-స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 15న 'సింపుల్ వన్' పేరుతో తమ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ కొత్త స్కూటర్ దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. తొలుత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో.. ఆ తర్వాత ఇతర నగరాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఫ్రెంచ్ టెక్నాలజీ దిగ్గజం డసో సిస్టమ్స్ ద్వారా తమ స్కూటర్‌ను డిజైన్ చేసినట్లు సింపుల్ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్ ధర వివరాలు అధికారికంగా తెలియనప్పటికీ.. రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.