తెలంగాణ

telangana

ETV Bharat / business

సింపుల్​ వన్​ ఈ-స్కూటర్ అదుర్స్​- ఓలాకు దీటుగా! - సింపుల్ ఎనర్జీ ఈ-స్కూటర్​ స్పీడ్ లిమిట్​

దేశీయ మార్కెట్లో విద్యుత్​ వాహనాల తయారీ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ తొలి విద్యుత్​ స్కూటర్​ను ఆగస్టు 15న విడుదల చేయగా.. దానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సింపుల్ ఎనర్జీ అనే సంస్థ కొత్త ఈ-స్కూటర్​ను ఆవిష్కరించింది. రేంజ్ విషయంలో ఓలా కన్నా సింపుల్​ ఎనర్జీ స్కూటర్​ కాస్త మెరుగ్గా ఉండటం గమనార్హం. ఈ స్కూటర్​ పూర్తి విశేషాలు ఇలా ఉన్నాయి..

Simple one e-scooter
సింపుల్​ వన్ ఈ-స్కూటర్​

By

Published : Aug 16, 2021, 8:10 PM IST

ఓలాకు పోటీగా.. మరో దేశీయ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను ఆవిష్కరించింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ.. స్కూటర్​ సింపుల్​ వన్​ పేరుతో తమ ఈ-స్కూటర్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను (ఎక్స్​ షోరూం) రూ.1,09,999గా నిర్ణయించింది.

సింపుల్​ వన్​ లుక్​

ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్​, రాజస్థాన్, గోవా, ఉత్తర్​ ప్రదేశ్​, గుజరాత్​, పంజాబ్​లో ఈ స్కూటర్​ను డెలవరీ చేయనుంది కంపెనీ. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సింపుల్ ఎనర్జీ తెలిపింది.

ఇప్పటికే రూ.1,947 రూపాయలతో ప్రీ ఆర్డర్లు ప్రారంభించింది కంపెనీ. ఫేమ్​ 2 రాయితీ పథకం కింద దాదాపు రూ.60 వేల వరకు సబ్సిడీ పొందే వీలుంది. వివిధ రాష్ట్రాలు విద్యుత్ వాహనాలకు ఇస్తున్న రాయితీలతో ఈ స్కూటర్​ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.

సింపుల్ వన్​ ఫీచర్లు..

  • మొత్తం నాలుగు రైటింగ్ మోడ్​లు (ఎకో, రైడ్​, డాష్​, సోనిక్​)
  • 7 అంగుళాల టచ్​ స్క్రీన్​ డిస్​ప్లే
  • 30 లీటర్ బూట్ స్పేస్​
    బూట్​ స్పేస్​
  • 4జీ టెక్నాలజీ అనుసంధానం
  • 4.8 కిలో వాట్స్ లీథియం ఆయన్ బ్యాటరీ
  • ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 236 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు
  • ఎకో మోడ్​లో 203 కిలో మీటర్లు ప్రయాణించే సామర్థ్యం
  • గరిష్ఠ వేగం గంటకు 105 కిలో మీటర్లు
  • 0-50 కిలోమీటర్ల వేగాన్ని.. కేవలం 3.6 సెకండ్లలో అందుకుంటుంది
  • బ్లూటూత్​ కనెక్టివటీ, జియో ఫెన్సింగ్​, కాల్ కంట్రోల్​, స్మార్ట్​ఫోన్​ అనుసంధానం చేసుకునే సదుపాయం, టైర్​ ప్రెషర్​ మానిటరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్​ సొంతం

ఈ స్కూటర్​లో రిమూవబుల్ బ్యాటరీని పొందు పరిచినట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని 15ఏ సాకెట్​ ద్వారా ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని వివరించింది. రానున్న ఏడు నెలల్లో 13 రాష్ట్రాల్లో 300లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

ఛార్జింగ్​​ సదుపాయం

తమిళనాడులోను హోసూర్​లో రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొదటి దశలో ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 10 లక్షల యూనిట్లుగా వివరించింది.

ఇదీ చదవండి:ఓలా ఈ-స్కూటర్​ రిలీజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!

ABOUT THE AUTHOR

...view details