తెలంగాణ

telangana

ETV Bharat / business

పిల్లల కోసం సీరం కొత్త టీకా- ఉత్పత్తి షురూ - కొవిడ్ టీకా

అమెరికా సంస్థ నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన 'కొవావ్యాక్స్' టీకా ఉత్పత్తిని భారత్​లో ప్రారంభించినట్లు సీరం​ సంస్థ పేర్కొంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా.

covavax, novavax
కొవావ్యాక్స్, కొవిడ్ టీకా

By

Published : Jun 25, 2021, 6:14 PM IST

అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన 'కొవావ్యాక్స్' టీకాను భారత్​లో ఉత్పత్తి చేయడం ప్రారంభించినట్లు సీరం​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా పేర్కొంది. పుణె కేంద్రంలో టీకా ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు.

"నొవావ్యాక్స్​ సంస్థ టీకాను స్వదేశంలో ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉంది. 18 ఏళ్ల లోపు వారికి కూడా ఈ టీకా బాగా ఉపయోగపడుతుంది. ట్రయల్స్​ ఇంకా జరుగుతున్నాయి. సీరం​ బృందానికి అభినందనలు."

--అదర్ పూనావాలా, సీరం​ సంస్థ సీఈఓ.

తొలుత.. ఈ ఏడాది మార్చ్​ నెలలో కొవావ్యాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ భారత్​లో ప్రారంభమైనట్లు పునావాలా తెలిపారు. సెప్టెంబర్​ కల్లా టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో సీరం​ సంస్థ.. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాలను భారత్​లో ఉత్పత్తి చేసింది.

ఇదీ చదవండి:సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్‌ టీకా!

ABOUT THE AUTHOR

...view details