వాట్సాప్ యాప్‌లో కొత్తగా షాపింగ్ బటన్ చేర్చారు. సంస్థ అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఇది దోహదపడనుంది. వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు రోజూ 17.5 కోట్ల మంది ప్రజలు సందేశాలు పంపుతున్నారని సంస్థ తెలిపింది. ప్రతి నెలా వ్యాపార క్యాటలాగ్‌లను 4 కోట్ల మందికి పైగా వీక్షిస్తున్నారు. ఇందులో భారతీయులు 30 లక్షలకు పైగానే ఉన్నారు. అందుకే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని భావించామని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్‌లో షాపింగ్ బటన్ - business news today
వాట్సాప్ వాయిస్ కాల్ బటన్ స్థానంలో కొత్త షాపింగ్ బటన్‌ను చేర్చారు. సంస్థ అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ఇది ఉపయోగపడనుంది.
వాట్సాప్‌లో షాపింగ్ బటన్
వాయిస్ కాల్ బటన్ స్థానంలో కొత్త షాపింగ్ బటన్‌ను చేర్చారు. ఇకపై వాయిస్ కాల్ బటన్ కోసం వినియోగదారులు కాల్ బటన్‌పై నొక్కి వాయిస్ లేదా వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.