దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో బుధవారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు పెరిగి.. రూ.89.54 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర కూడా 25 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ.79.99 వద్ద ఉంది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్‌కు 22-26 పైసల మధ్య పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 24 పైసల నుంచి 27 పైసల వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.