రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవి కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెట్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ పదవి కాలం డిసెంబరు 10తో ముగియనుండగా తాజా నిర్ణయంతో అతడు మూడేళ్లపాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయన అదే పదవిలో కొనసాగనున్నారు. డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం పొడిగింపు - ఆర్బీఐ కొత్త గవర్నర్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది డిసెంబరు 12 నుంచి ఈ నియామకం అమలులో ఉంటుందని వెల్లడించింది.
శక్తికాంత్ దాస్
గతంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంత్ దాస్.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులలో భారత ప్రత్యామ్నయ గవర్నర్‌గాను సేవలందించారు. 2018 డిసెంబర్ 11న మూడేళ్ల కాలానికి ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. మెరుగైన పనితీరును కనబర్చారు.
ఇదీ చూడండి :ట్రూకాలర్‌తో భారతీయ రైల్వే డీల్.. ప్రయాణికులకు లాభాలివే...
Last Updated : Oct 29, 2021, 9:09 AM IST