దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ రవాణాలో క్షేత్రస్థాయి సేవలకు స్పైస్‌జెట్ సరకు రవాణా విభాగం స్పైస్ఎక్స్ప్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది థర్డ్‌పార్టీ రవాణా ప్లాట్‌ఫాం షాడోఫాక్స్. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
ఒప్పందంలో భాగంగా 250కిపైగా రిఫ్రిజిరేటెడ్ వాహనాలను క్షేత్రస్థాయిలో రవాణా చేసేందుకు మోహరించనున్నట్లు తెలిపింది షాడోపాక్స్. స్థిరమైన కోల్డ్‌చైన్ ద్వారా వ్యాక్సిన్ డెలివరీలో వేగవంతమైన, నమ్మకమైన సరఫరా పరిష్కారం లభిస్తుందని వెల్లడించింది.
" కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీలో షాడోఫాక్స్ రవాణా సదుపాయాలను అందిస్తుంది. దేశంలోని 500లకుపైగా నగరాల్లో గుర్తింపు పొందిన డెలివరీ భాగస్వామ్య నెట్‌వర్క్‌ల ద్వారా చివరి గమ్యం వరకు చేరవేస్తాం. దేశంలో మొత్తం 7,000 గ్రామాలకు మా సేవలు అందిస్తాం. వ్యాక్సిన్ రవాణాలో స్పైస్ఎక్స్ప్రెస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. సరైన సమయానికి, సురక్షితమైన డెలివరీ కోసం ఇప్పటికే మా సాంకేతికత, సిబ్బంది, డెలివరీ నిపుణులను అప్రమత్తం చేశాం."